యాదాద్రిభువనగిరి ప్రతినిధి:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జూనియర్, ఔట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శుల పట్ల వివక్షత చూపుతుందని ప్రజాసంఘాలు మండిపడ్డాయి. యాదాద్రిభువనగిరి కలెక్టరేట్ వద్ద పంచాయతీ కార్యదర్శులు నిర్వహించిన ధర్నాలో పాల్గొని తమ మద్దతు తెలిపాయి. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శులు మాట్లాడుతూ… మూడు సంవత్సరాల ప్రొబేషన్ పీరియడ్‌తో ఎంపికై.. నాలుగేండ్లు ప్రోబేషన్ పీరియడ్ ముగిసినా.. ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయడకపోవడం దారుణమన్నారు. ఏప్రిల్ 28 నుంచి నిరవధిక సమ్మె చేస్తోన్న ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడం శోచనియమన్నారు. ఈ సందర్భంగా పలు ప్రజా సంఘాలు, వివిధ పార్టీల నాయకులు పాల్గొని మద్దుతు ప్రకటించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం, బీజేపీ నాయకులు మట్టిపల్లి శ్రీనివాస్ గౌడ్, నాగినేనిపల్లి ఎంపిటిసి పక్కి రాజేందర్ రెడ్డి, లక్ష్మీదేవి కాల్వ సర్పంచ్ నారగోని అంజయ్య, యూటిఎఫ్ జిల్లా కార్యదర్శి ముక్కెర్ల యాదయ్య, సీపీఐ నాయకులు ఏశాల అశోక్ ,చెక్కా వెంకటేశం, తెలంగాణ ప్రజాఫ్రంట్ అధ్యక్షుడు ఆశపాక మల్లేష్, జేఏసీ జిల్లా అధ్యక్షులు ఆరే రాజు, ప్రధాన కార్యదర్శి వీసం నరేందర్, వెంకటేష్, శ్రీనివాస్, శివ, స్వరూప, అలివేలు, మమత, స్వామి, మహేందర్, రామకృష్ణ, కృష్ణయ్య, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.