జిల్లా ఎస్పీ అపూర్వరావు
నల్లగొండ: పోలీసు గ్రీవెన్స్ డేలో ఫిర్యాదుచేసిన బాధితులకు సత్వరమే న్యాయం జరిగేలా చూడాలని జిల్లా ఎస్పీ అపూర్వరావు అధికారులను ఆదేశించారు. ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డే లో భాగంగా జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దాదాపు 25 మంది అర్జీదారులు ఫిర్యాదు చేశారు. ఎస్పీ అపూర్వరావు ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి తమ సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించారు. భూసమస్యలు, ఫైనాన్స్ సమస్యలు, ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు వసూళ్లపైన ఫిర్యాదులు రావడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ అపూర్వరావు మాట్లాడుతూ.. ప్రజలకు పోలీసు శాఖను మరింత చేరువ చేయడం లక్ష్యంగా ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నామన్నారు. ఎవరైనా కాంట్రాక్ట్ ఉద్యోగాలు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తామని మాయమాటలు చెప్పి డబ్బులు వసూలు చేస్తే.. వారి మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. ఎవరైనా చట్టవ్యతిరకమైన చర్యలకు పాల్పడుతూ శాంతి భద్రతలకు భంగం కలిగించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని అధికారులకు ఆదేశించారు. బాధితుల ప్రతి ఫిర్యాదును ఆన్‌లైన్‌లో పొందుపరుస్తూ నిత్యం పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు.
Behind the News