- 70 శాతం డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులే..
- టెక్నికల్ సమస్యలకు తోడు
- రవాణా శాఖ స్టాఫ్‌పై పని ఒత్తిడి
- ఇకపై ప్రతి 3 నెలలకోసారి చర్యలు
Licence : తెలంగాణ రవాణ శాఖ మందుబాబులపై కొరడా ఝళిపిస్తోంది. రోడ్డు ప్రమాదాల్లో ఏటా వేలాది మంది ప్రాణాలు కోల్పోయి కుటుంబాలు రోడ్డునపడుతున్నాయి. ఈ ప్రమాదాలకు ప్రధాన కారణాలు అతివేగం, మద్యం తాగి వాహనం నడపడమే. ఈ క్రమంలోనే ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తున్న వాహనదారులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఒకట్రెండు సార్లు వార్నింగ్ ఇచ్చి వదిలేస్తున్నా.. మూడోసారికి మాత్రం డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తుండడం గమనార్హం. అందులో భాగంగానే గత మూడేండ్లలో 64,083 డ్రైవింగ్లైసెన్స్లను రవాణ శాఖ అధికారులు రద్దుచేశారు.
2021 ఏప్రిల్ నుంచి 2022 మార్చి 31 వరకు 14, 220 లైసెన్స్‌లు, 2022 ఏప్రిల్ 1 నుంచి 2023 మార్చి 31 వరకు 30,638 లైసెన్స్‌లు, 2023 ఏప్రిల్ 1 నుంచి 2024 మార్చి 31 వరకు 19, 225 డ్రైవింగ్ లైసెన్స్‌లు రద్దయ్యాయి. తాజాగా 2024 ఏప్రిల్ 1 నుంచి 2024 నవంబర్ 30 వరకు 10,113 లైసెన్స్‌లను క్యాన్సిల్ చేశారు. అయితే ఏటా రద్దయ్యే లైసెన్స్‌ల్లో 70 శాతం వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులే ఉంటున్నాయి. మందుతాగి మొదటిసారి పట్టుబడితే ఫైన్లతో సరిపెడ్తున్న అధికారులు, రెండోసారి, మూడోసారి పట్టుబడితే మాత్రం డ్రైవింగ్ లైసెన్స్‌లు(licence) రద్దు చేస్తున్నారు. కానీ టెక్నికల్ సమస్యలకు తోడు స్టాఫ్‌పై ఇతర పని ఒత్తిడి వల్ల డ్రైవింగ్ లైసెన్స్‌ల క్యాన్సిల్‌పై సత్వర నిర్ణయాలు తీసుకోలేకపోతున్నామని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. ఇకపై ప్రతి 6 నెలలకోసారి ఎప్పటికప్పుడు వచ్చిన సిఫారసుల ఆధారంగా డ్రైవింగ్ లైసెన్స్‌లను రద్దు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.
sucide : భార్య వేధింపులతో టెకీ సూసైడ్.. అతుల్ సుభాష్ ఆత్మహత్యపై దేశవ్యాప్త చర్చ
ఇదిలావుంటే.. రద్దు చేసిన లైసెన్స్‌ల్లో(licence) దాదాపు 70 శాతం డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికిన మందుబాబులదే. మిగతా 30 శాతం ర్యాష్ డ్రైవింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్, హెవీ లోడ్ తో రోడ్లపై భారీ వాహనాలను నడుపుతూ పట్టుబడ్డ వాహనదారులవి ఉన్నాయి. అయితే గతంలో కంటే ఈసారి మద్యం సేవించి పోలీసులకు పట్టుబడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. అందులో ఎక్కువ మంది మైనర్లు, యువత ఉండడం ఆందోళన కలిగించే అంశంగా చెప్పోచ్చు.