Ameenpur : స్వచ్ఛతలో అమీన్‌పూర్ భేష్..

Ameenpur : స్వచ్ఛతలో అమీన్‌పూర్ భేష్..
  • అవార్డు రావడం సంతోషకరం
  • మున్సిపల్ కమిషనర్ జ్యోతిరెడ్డి

Ameenpur : స్వచ్ఛత విషయంలో అమీన్‌పూర్ మున్సిపాలిటీలో ముందంజలో ఉందని, చేంజ్ మేకర్స్ అవార్డు రావడం సంతోషించదగ్గ విషయమని మున్సిపల్(muncipal) కమిషనర్ జ్యోతిరెడ్డి అన్నారు. చేంజ్ మేకర్స్ కన్‌క్లేవ్ కార్యక్రమంలో చేంజ్ మేకర్స్ అవార్డు అందుకుంటున్న నేపథ్యంలో కమిషనర్ జ్యోతిరెడ్డి మాట్లాడారు. మున్సిపాలిటీకి ఈ అవార్డు(award) దక్కడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ అందుకు సహకరించిన మున్సిపాలిటీ సిబ్బందికి, ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు.

2021 నుంచి 2024 వరకు స్వచ్ఛభారత్(swacha bharath) మిషన్‌లో భాగంగా స్వచ్ఛత కార్యక్రమాలు, స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మెరుగైన ప్రదర్శన, చెత్తతో నూతన వస్తువులు తయారు చేయడం, కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా స్వచ్ కార్యక్రమాలు, సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్‌లో ఉత్తమ ప్రతిభను కనబరిచిన మున్సిపాలిటీలకు సీఎస్ఈ, ఎంహెచ్‌యూఏ సంయుక్తంగా ఢిల్లీలో డిసెంబర్ 19 న సిల్వర్ హోక్ హాల్‌లో ఏర్పాటు చేసిన చేంజ్ మేకర్స్ కార్యక్రమంలోసీఎస్ఈ డైరెక్టర్ డాక్టర్ సునీత నరైన్ చేతుల మీదుగా చేంజ్ మేకర్ అవార్డును జాయింట్ డైరెక్టర్ బి.సంధ్య, పర్యావరణ ఇంజనీర్ కె.శశి కుమార్ అందుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *