- 45 ఎండ్ల రాజకీయ జీవితంలో తొలిసారి జైలుకు..
- ఎన్నికల వేళ టిడిపికి ఊహించని షాక్
దాదాపు 45 ఏండ్ల రాజకీయ జీవితం.. మూడుసార్లు తిరుగులేని ముఖ్యమంత్రిగా బాధ్యతలు.. జాతీయ స్థాయి రాజకీయాల్లో చక్రం తిప్పగలిగే వ్యుహాకర్తగా మంచిపేరు. ఇన్నేండ్ల రాజకీయ జీవితంలో ఏనాడూ జైలు గడప తొక్కింది లేదు. పెద్దగా అవినీతి ఆరోపణలు.. విచారణను ఎదుర్కొందీ లేదు. అంతటి చరిష్మా కలిగిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు(Chandrababu) ఒక చిన్న కేసులో రిమాండ్ ఖైదీగా జైలు గడప తొక్కడం గమనార్హం. ఈ నేపథ్యంలో చంద్రబాబు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న స్కిల్ డవలప్‌మెంట్ కేసు(skill development scam)లో ఊహించని విధంగా తీర్పునిచ్చిన ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎవ్వరనేది ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ సంచలన తీర్పునిచ్చిన ఆ న్యాయమూర్తి పేరు జస్టిస్ బొక్క సత్యవెంకట హిమబిందు(Justice Hima Bindu).
తొణుకు బెణుకు లేకుండా తీర్పు..
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu) జాతీయస్థాయి రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు ఉన్న పొలిటికల్ లీడర్. దాదాపు సీఎం ఓ స్కామ్‌లో ఇన్వాల్వ్ అయ్యారంటే.. అదీ వేల కోట్లో.. లక్షల కోట్లో.. అని అంతా భావిస్తుంటారు. అదీ మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి అయితే బడా స్కామ్ అని అనుకుంటారు. కానీ చంద్రబాబు విషయంలో అదికాస్త తలకిందులయ్యింది. ప్రస్తుత రాజకీయాల్లో ఎమ్మెల్యేలే రూ.వందల కోట్ల స్కామ్ చేస్తుంటే.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu) మాత్రం కేవలం రూ.279 కోట్ల స్కామ్‌లో ఇరుక్కుపోయారు. అయితే ఈ కేసుకు సంబంధించి 24 గంటల్లోనే అరెస్టు.. కోర్టులో హాజరుపర్చడం.. రిమాండ్ విధిస్తూ తీర్పునివ్వడం.. చకచకా జరిగిపోయాయి.
సాధారణంగా ఈ తీర్పును ఇచ్చే న్యాయమూర్తుల్లో ఒకింత టెన్షన్ కామన్. చంద్రబాబు కేసులో తీర్పు అంటే.. అందరి చూపు సదరు న్యాయమూర్తిపైనే ఉంటుంది. దీంతో ఆ న్యాయమూర్తిపైన ఒత్తిడి సహాజమే. కానీ తాజా తీర్పునిచ్చిన జస్టిస్ హిమబిందు(Justice Hima Bindu)లో మాత్రం ఏ తొణుకు బెణుకు కన్పించకపోవడం విశేషం. ఆయనో మాజీ ముఖ్యమంత్రి అని గానీ.. పొలిటికల్ ప్రెజర్ ఉంటుందనే.. అలజడి గానీ జస్టిస్ హిమబిందులో ఏ మాత్రం కన్పించలేదు. సరికదా ఓ సాధారణ కేసుల్లాగే ఇరువర్గాల వాదనలు విని.. అందరిలాగే చంద్రబాబుకు రిమాండ్ విధించేశారు.
పూర్వాపరాలను ఒక్కసారి పరిశీలిస్తే..
స్కిల్ డవలప్‌మెంట్ కేసు(skill development scam)లో చంద్రబాబుకు రిమాండ్ విధించడం.. 45 ఏండ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు(Chandrababu)ను తొలిసారిగా జైలు గడప తొక్కేలా చేయడంలో జస్టిస్ హిమబిందు(Justice Hima Bindu) ఇచ్చిన తీర్పే కారణం. నిజానికి ఆ కేసులో చంద్రబాబు ప్రమేయం పాత్ర.. పొలిటికల్ అంశాలను పక్కన పెడితే.. న్యాయవ్యవస్థ సరిగ్గా పనిచేస్తే.. మాజీ ముఖ్యమంత్రి సైతం చట్టం ముందు దిగదుడుపేనన్న సంగతి తెలిసిందే.
మరీ ఇంతకీ ఆ చారిత్రత్మాక తీర్పునిచ్చిన జస్టిస్ సత్య వెంకటహిమబిందుపై చర్చ మాత్రం ఆసక్తికరంగా సాగుతోంది. ప్రస్తుతం రెండు తెలుగురాష్ట్రాల్లో జస్టిస్ హిమబిందు పేరు మారుమోగుతుంది. 2016లో తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో అదనపు జిల్లా, సెషన్స్ జడ్జిగా పనిచేశారు జస్టిస్ హిమబిందు. అంతకు ముందు ఆమె ఏసీబీ కోర్టులో న్యాయమూర్తిగా ఉన్నారు.
ఈ ఏడాది ఏప్రిల్ 18, అంటే 2023న, సీబీఐ నిర్వహించే అంశాలకు సంబంధించి ఆమెకు ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జి పదవిని ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టుపై జస్టిస్ హిమ బిందు ఇచ్చిన రిమాండ్ తీర్పు అందరి దృష్టినీ ఆకర్షించింది. గతంలోనూ జస్టిస్ హిమబిందు ఆమె అనేక సంచలన తీర్పులు ఇచ్చారు.