- ఆదివాసీ, గిరిజనుల ఆత్మగౌరవ ప్రతీక
- వీరుల చరిత్రను వెలుగులోకి తేవాలి
- సమక్క – సారలమ్మ భక్తులు విజ్ఞప్తి
మేడారం నుంచి దిశ నల్లగొండ ప్రత్యేక ప్రతినిధి:
Medaram Jatara : రెండేండ్లకోసారి జరిగే మేడారం సమ్మక్క – సార లమ్మ జాతర గిరిజనులు, ఆదివాసీల ఆత్మగౌరవానికి ప్రతీక. అణగారిన వర్గాలకు అండగా నిలిచిన సమ్మ క్క-సారలమ్మ చరిత్రను వక్రీకరించేందుకు ఏన్నో ఏండ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నాయని భక్తులు ఎంతోకాలంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకానొక దశలో అసలు సమ్మక్క-సారలమ్మది చరిత్ర కాదు, ఓ కల్పిత కథ అని ప్రచారం జరిగినా, ఆ ప్రభావం భక్తులు విశ్వాసంపై ఇసుమంతైనా పడలేదు. అడవి బిడ్డల ఆత్మ గౌరవానికి నిదర్శనమైన మేడారం జాతర ప్రారంభమవుతున్న సందర్భంగా భక్తుల మనోభావాలపై ‘దిశ నల్లగొండ’ ప్రత్యేక కథనం.
వడ్డెలను పట్టించుకోరు..
Medaram Jatara : మరో 15 రోజుల్లో జాతర మొదలవుతుందన్నప్పటి నుంచి సమ్మక్క-సారలమ్మ(Medaram Jatara) పూజారుల(వడ్డెలు)పైనే అందరి దృష్టి ఉంటుంది. అయితే జాతర ముగిసిన తర్వాత వారిని పట్టించుకునేవారుండరు. జాత రలో అన్ని తామై అమ్మల సేవలో తరించే వడ్డెలు భక్తులకు ఆధ్యాత్మికతను అందించి, జాతర ముగి సిన అనంతరం తమ జీవన పోరాటం కొనసాగి స్తారు. కొందరు వ్యవసాయం చేసుకుంటే, కొందరు కూలీ పనులకు వెళుతుంటారు. కీలకంగా వ్యవహరించే వడ్డెల బాగోగులను నాటి నుంచి నేటి వరకు ఎవరూ పట్టించుకున్న దాఖలాలు లేవు.
జాతరకు సముచిత స్థానం
సమ్మక్క-సారలమ్మ చరిత్ర మరుగున పడిపో కుండా ఆదివాసీలు, గిరిజనులు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. స్వాతంత్య్ర ఉద్యమం నుంచి తెలంగాణ ఉద్యమం వరకు జరిగిన ఎన్నో పోరాటల్లో పాల్గొన్న ఆదివాసీ, గిరిజ నులకు సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, మేడరాజు, రెండో మేడరాజు వంటి వారే స్పూర్తి. అలాంటి మహనీయుల చరిత్రను భావితరాలకు అందకుండా పోతోందని వారి ఆవేదన. తమ సంప్రదాయాలకు, ఆచారా లకు విలువ ఇవ్వడం లేదని, గతంలో వడ్డెల స్థానంలో బ్రాహ్మణ పూజారులను జాతరకు నియమించారని వారు చెబుతున్నారు. బ్రా హ్మణ పూజారుల విషయంపై తీవ్ర వ్యతిరేఖత రావడంతో ప్రభుత్వం ఆ ఆలోచనను విరమించుకుంది. ప్రభుత్వాలు, మేథావులు ముందుకొచ్చి చరిత్రను వెలుగులోకి తేవాలని, జాతరకు దేశంలో సముచిత స్థానం కల్పించాలని భక్తులు కోరుతున్నారు.
Chalo Nalgonda : నల్లగొండలో కేసీఆర్ బహిరంగ సభ.. సమన్వయకర్తలు వీళ్లే..
సమ్మక్క చావలే..
ఆదివాసీలు, గిరిజనుల ఆత్మ ఈ సమ్మక్క. కాకతీయ రాజులతో జరిగిన యుద్ధంలో పగిడిద్దరాజు, సమ్మక్క, సారలమ్మ, జంపన్న వంటి వీరులు చనిపో యారంటే. ఇక్కడి వారేవరూ అంగీకరించరు. వారంతా తమతో ఈ అడవిలోనే ఉన్నారని విశ్వసిస్తారు. అందులో భాగంగానే రెండేండ్లకోసారి సమ్మక్క భరిణి సాక్షాత్కరిస్తుందని వారి నమ్మకం.
Medaram Jatara
పాలకుల వైఖరి మారాలి
జాతర సమయంలో నానా హంగామా చేసే ప్రభుత్వాలు, జాతర ముగిసిన తర్వాత అటువైపు కన్నెత్తి కూడా చూడవు. సమ్మక్క-సారలమ్మ జాతర 12వ శతాబ్ధం నుంచి జరుగుతోంది. అప్పుడు ఆదివాసీలు, గిరిజనులు మాత్రమే జాతర చేసుకునే వారు. కాలక్రమేణా జాతరకు వచ్చే భక్తుల సంఖ్య పెరగడంతో ప్రభుత్వాలు జాతర నిర్వహించడం మొదలుపెట్టాయి. ప్రత్యేక నిధులు కేటాయించి జాతర పూర్తి చేస్తున్నాయి. అయితే ఎన్ని సంవత్సరాలు గడిచినా మేడారంలో ప్రగతి మాత్రం కనిపించదు. జాతరకు ముందు ఊరు ఎలా ఉందో, తరువాత కూడా అలానే ఉంటుంది. జాతర పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు చేసే ప్రభుత్వాలు జాతర అనంతరం ఈ ప్రాంతం అభివృద్ధిపై దృష్టి పెడితే మంచిది.