దిశ నల్లగొండ, హైదరాబాద్ బ్యూరో:
NEP : జాతీయ నూతన విద్యావిధానం అణగారిన వర్గాలకు శాపంగా మారనుందని ఉస్మానియా యూనివర్సిటీ పీహెచ్‌డీ స్కాలర్ పాలడుగు శ్రీనివాస్ తెలిపారు. బుధవారం ఢిల్లీలో కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను పీహెచ్‌డీ స్కాలర్ పాలడుగు శ్రీనివాస్ బృందం కలిసి జాతీయ నూతన విద్యావిధానం వల్ల కలిగే నష్టాలు, యూనివర్సిటీల్లో రిక్రూట్‌మెంట్ తదితర సమస్యలను విన్నవించారు. ఈ సందర్భంగా ఓయూ పీహెచ్‌డీ స్కాలర్ పాలడుగు మాట్లాడుతూ.. విద్యా కాషాయీకరణ, విద్యా ప్రైవేటీకరణ కోసమే నూతన విద్యా విధానాన్ని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తోందని ఆరోపించారు.
NEP
రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానం-2020 సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు తిరస్కరించాలని కోరారు. ప్రభుత్వ విద్యను పూర్తిగా నిర్వీర్యం చేసి పేద, మధ్య తరగతి వర్గాలకు విద్యను దూరం చేసే కుట్ర అమలు చేస్తున్నారని, దానిలో భాగమే కేంద్రంలో నూతన జాతీయ విద్యావిధానం-2020 తీసుకొచ్చారని విమర్శించారు. విద్యా కార్పొరేటికరణ, కాషాయికరణ చేయాలని కేంద్రం కుట్ర పన్నుతోందని అన్నారు.
దేశంలో జాతీయ విద్యా విధానం వల్ల దాదాపు 90% విద్యార్థులు నాణ్యమైన విద్య పొందే హక్కును కోల్పోతారని, విద్యా వ్యాపారీకరణ వలన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీలకు సామాజిక న్యాయం దూరం చేసే విధంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. భిన్నత్వంలో ఏకత్వానికి బదులు హిందుత్వ రాజ్యాన్ని స్థాపించడానికి బాటలు వేస్తున్నారని ఆరోపించారు.
Medaram Jatara : సమ్మక్క.. మా దేవత.. ఆ చరిత్ర కల్పితం కాదు.. వాస్తవం సమ్మక్క చావలే..
నూతన జాతీయ విద్యా విధానంలో ప్రైవేటు విశ్వవిద్యాలయలను, విదేశీ విశ్వవిద్యాలయాలను అనుమతిస్తారని తెలిపారు. ఇప్పటికే పేద వర్గాలకు అందని ద్రాక్షగా మారిన విద్య, NEP అమలుతో విద్యకు మరింత దూరం చేయబడుతారని తెలిపారు.