జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
యాదాద్రిభువనగిరి ప్రతినిధి:
సీపీఆర్ విధానంపై ప్రతిఒక్కరికీ అవగాహన ఉండాలని యాదాద్రిభువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. ప్రపంచ రెడ్ క్రాస్ డే దినోత్సవాన్ని పురస్కరించుకొని యాదాద్రి భువనగిరి జిల్లా రెడ్ క్రాస్ శాఖ ఆధ్వర్యంలో భువనగిరి పట్టణంలో సీపీఆర్ అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. జిల్లా శాఖ రెడ్ క్రాస్ చైర్మన్ లక్ష్మినర్సింహ్మారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు. సీపీఆర్‌పై అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సదస్సులు ఏర్పాటు చేస్తుందన్నారు. 30 ఏళ్ల కిందట మనిషి జీవన విధానం ఒకలా ఉంటే ప్రస్తుతం మరోలా ఉందన్నారు. మనిషి జీవన విధానంలో చాలా మార్పులు వచ్చాయన్నారు. ఒకప్పుడు గుండె సంబంధిత వ్యాధులు కేవలం వృద్దులకు , ఉబకాయం ఉన్నవారికి మాత్రమే వస్తాయని అనుకునే వారన్నారు. కానీ కోవిడ్ వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయని, ఇప్పుడు అందరూ ఇలాంటి సమస్యలను ఎదుర్కుంటున్నారని చెప్పారు. నివాస ప్రాంతాల్లో ఉండే ప్రజలకు సిపిఆర్ పట్ల అవాహన ఉండాలని, దీనివల్ల ఎవరికైనా ఏదైనా ఇబ్బంది కలిగినట్లు అనిపిస్తే మన కుటుంబ సభ్యులను కానీ ఇతర వారిని సిపిఆర్ చేసి రక్షించే అవకాశం ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా శాఖ వైస్ చైర్మన్ దిడ్డి బాలాజీ, జిల్లా కమిటీ సభ్యులు షేక్ హమీద్ పాష, దేవనకం అంజయ్య, శ్రీనివాస్ రెడ్డి, జంపాల అంజయ్య, రాంబాయి, ప్రభాకర్ రెడ్డి, శంకర్ రెడ్డి, వెంకటేష్, మచ్చెందర్, అంగన్వాడి కార్యకర్తలు, ఆశా వర్కర్లు, రెడ్ క్రాస్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Behind the News