పలు అభివృద్ధి పనులపై సమీక్ష
భూదాన్ పోచంపల్లి : దశలవారీగా నియోజకవర్గాన్ని అభివృద్ది చేస్తానని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. పోచంపల్లి పట్టణ పరిధిలో రూ.5.95 లక్షల వ్యయంతో చేపడుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను 6వ వార్డులో సోమవారం ప్రారంభించారు. రూ.6.50 లక్షల వ్యయంతో చేపట్టబోతున్న డ్రైనేజీ పనులకు సంబంధించిన ప్రాంతాల్లో ఎమ్మేల్యే పైళ్ల శేఖర్ రెడ్డి పర్యటించారు. అనంతరం నియోజకవర్గ అభివృద్ధికి మంజూరైన ఎస్డిఎఫ్ నిధుల నుంచి పట్టణంలో చేయాల్సిన అభివృద్ధి పనులపై మున్సిపల్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ చిట్టిపోలు విజయలక్ష్మీ, మున్సిపల్ కమిషనర్ ఎస్. భాస్కర్ రెడ్డి, వైస్ చైర్మన్ బాత్క లింగస్వామి, కౌన్సిలర్లు పెద్దల చక్రపాణి, కర్నాటి రవీందర్, గుండు మధు, సామల మల్లారెడ్డి, దేవరాయ కుమార్, పబ్లిక్ హెల్త్ ఈఈ సత్యనాయణ, డీఈ మనోహర్, ఏఈ శ్రీ రాములు తదితరులు పాల్గొన్నారు.
Behind the News