- ఒడిశా గవర్నర్‌గా ఝార్ఖండ్ మాజీ సీఎం రఘుబర్
- రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఉత్తర్వులు
- మలక్‌పేట నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఇంద్రసేనారెడ్డి
- తెలంగాణలోని సూర్యాపేట సొంత ప్రాంతం
- ఉమ్మడి ఏపీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగానూ బాధ్యతలు
- అసెంబ్లీ ఎన్నికల వేళ కేంద్రం కీలక నిర్ణయం
దిశ నల్లగొండ, హైదరాబాద్ బ్యూరో:
త్రిపుర, ఒడిషా రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల(governer)ను నియమిస్తూ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిర్ణయం తీసుకుంది. త్రిపుర గవర్నర్(governer)గా బీజేపీ సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి(Nallu Indrasena Reddy), ఒడిషా గవర్నర్‌గా ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి రఘుబర్ దాస్‌లను నియమిస్తూ రాష్ట్రపతి కార్యాలయం బుధవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపింది. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెలంగాణ బీజేపీ సీనియర్ లీడర్ నల్లు ఇంద్రసేనారెడ్డిని గవర్నర్(governer)గా నియమించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదిలావుంటే.. త్రిపుర గవర్నర్‌గా నియమితులైన నల్లు ఇంద్రసేనారెడ్డిది సూర్యాపేట జిల్లా సొంత ప్రాంతం. ఇంద్రసేనారెడ్డి(Nallu Indrasena Reddy) తెలుగు ప్రజలందరికీ సుపరిచితుడే.
గతంలో ఇంద్రసేనారెడ్డి మలక్‌పేట నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఉమ్మడి ఏపీలోనూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. రాష్ట్రంలో బీజేపీ చేరికలు, సమన్వయ కమిటీ చైర్మన్‌గా నల్లు ఇంద్రసేనారెడ్డి(Nallu Indrasena Reddy) 2022లో ప్రకటించారు. కాగా ఒడిషా గవర్నర్‌గా నియమితులైన రఘుబర్‌దాస్ 2014 నుంచి 2019 వరకు ఝార్ఖండ్ సీఎంగా పనిచేశారు. ప్రస్తుతం రఘుబర్ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నారు.