- పనులు, వ్యయం, అనుమతులు, ఆర్థిక వనరుల
- సమీకరణపై కాగ్ ఆడిట్
- అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు వీలుగా రిపోర్టు
దిశ నల్లగొండ, హైదరాబాద్ బ్యూరో:
దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వంగా నిలిచిపోయిన కేసీఆర్ పాలనలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) డొల్లతనం అందరికీ తెలిసిందే. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం రూ.వేల కోట్ల అవినీతికి తార్కాణంగా నిలిచింది. ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు సైతం పిల్లర్లు కుంగిపోయి.. లీకేజీలు బయటపడ్డాయి. సాక్షాత్తూ కొత్త ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో జరిగిన అవినీతి శ్వేతపత్రం రూపంలో బహిర్గతం చేసింది. అయితే తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను అందించింది.
Kaleshwaram Project:
ఇప్పటికే కాగ్ కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) ప్రణాళిక, పనులు, అంచనా వ్యయం, అనుమతులు, ఆర్థిక వనరుల సమీకరణపై ఆడిట్ నిర్వహించింది. పనుల పురోగతి, భూసేకరణ, సహాయ – పునరావాసం, డిజైన్ల ఖరారు, ఒప్పందాలు, ప్రణాళిక, అంచనాల తయారీ, వృథా ఖర్చు, టెండరింగ్ విధానం, చెల్లింపులపైనా ఆడిట్ నిర్వహించారు. ప్రాజెక్టు(Kaleshwaram Project) పనితీరుకు సంబంధించిన ఆడిట్ రిపోర్టును ప్రభుత్వానికి సమర్పించినట్లు అకౌంటెంట్ జనరల్ తెలిపారు.
Kaleshwaram Project:
శాసనసభ, మండలిలో ప్రవేశపెట్టేందుకు వీలుగా నివేదిక ఇచ్చినట్లు పేర్కొన్నారు. ప్రాజెక్టులపై లేవనెత్తిన అభ్యంతరాలు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వివరణలతో కూడిన పూర్తి వివరాలను కాగ్ నివేదికలో పొందుపర్చింది. ఫిబ్రవరిలో నిర్వహించే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఈ నివేదిక శాసనసభ, శాసనమండలి ముందుకు తీసుకురానుంది.
Police: పంజాగుట్ట ఠాణా ఖాళీ.. 85 మందిని బదిలీ చేస్తూ సీపీ ఉత్తర్వులు