దిశ నల్లగొండ, పటాన్ చెరు:
Patancheru : క్రీడలతో స్నేహ బంధాలు మెరుగు పడడంతో పాటు మానసిక ఉల్లాసం శారీరక దారుఢ్యం లభిస్తాయని నైబర్ వుడ్ అసోసియేషన్ అధ్యక్షుడు ఈశ్వరి గారి రమణ పేర్కొన్నారు. ఆదివారం రాత్రి తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని మేరు ఇంటర్నేషనల్ స్కూల్ ఆవరణలో తెనా కార్నివాల్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. 700 మంది క్రీడాకారులతో నిర్వహించిన క్రీడల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం దాతల సహకారంతో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 30 మంది పేద విద్యార్థినులకు సైకిల్ అందజేశారు.
Patancheru
వివిధ విభాగాల్లో ఉత్తమంగా రాణిస్తున్న గేటెడ్ కమ్యూనిటీలకు తెనా ఉత్తమ కమ్యూనిటీ అవార్డులను అందజేశారు. ఈ అవార్డుల్లో ఉత్తమ గ్రీన్ స్పేస్ అవార్డు, బెస్ట్ సెక్యూరిటీ మెజర్స్ అవార్డు, బెస్ట్ సస్టైనబుల్ వేస్ట్ మేనేజ్మెంట్ అవార్డు, ఉత్తమ నిర్వాహణ కమ్యూనిటీ అవార్డు అందజేశారు. 9 గేటెడ్ కమ్యూనిటీలో ఈ అవార్డులను గెలుచుకున్నాయి. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు, గేటెడ్ కమ్యూనిటీ పరిధిలో నివాసితులు ఆయా సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తూ నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
ఈ సందర్భంగా ఈశ్వరి గారి రమణ మాట్లాడుతూ గత రెండేళ్లుగా తెనా కార్నివాల్ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. రెండు నెలల ముందు నుంచే సుమారు 50 కమ్యూనిటీ ల నుంచి 700 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు ఈ పోటీల తో క్రీడాకారులతో స్నేహబంధాలు మెరుగుపడతాయని అంతేకాకుండా శరీరానికి తగిన వ్యాయామం అంది మానసికంగా శారీరకంగా ఆరోగ్యవంతంగా తయారవుతామని తెలిపారు.
CM Revanth : 6 గ్యారంటీలకు 2 లక్షల ఫేక్ అప్లికేషన్లు.. సీఎం రేవంత్ ఏం చేశారంటే..?
గేటెడ్ కమ్యూనిటీలో నిత్యం స్నేహపూర్వక సంబంధాలు కొనసాగాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి మేరు ఇంటర్నేషనల్ స్కూల్ తో పాటు మరో 9 మంది దాతలు సహకారం అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్నివాల్ ప్రతినిధులు దీప్తి, కవిత, రవి రమణ, రవికిరణ్, రామ్మూర్తి, రామ్ కుమార్, చైతన్య, ప్రతాప్ లోక్నాథ్ తదితరులు పాల్గొన్నారు.