CM REVANTH REDDY: బీఆర్ఎస్ సచ్చింది.. కేటీఆర్ అడిగినా అపాయింట్‌మెంట్ ఇస్తాం..

CM REVANTH REDDY
  • కేసీఆర్ రూ.7 లక్షల కోట్లు అప్పుజేస్తే..
  • మోదీ రూ.100 కోట్ల అప్పుజేసిండు
  • కేసీఆర్ మౌనంగా ఇంట్ల పండుకోలే
  • మోదీతో రహస్య ఒప్పందం చేసుకుండు
  • ఏఐసీసీకే ఎంపీ అభ్యర్థుల ఎంపిక నిర్ణయం
  • ఫిబ్రవరి 3 వరకు దరఖాస్తు చేసుకోవాలి
  • ఎస్సీ, ఎస్టీలకు రూ.25వేలు
  • బీసీ, జనరల్ అభ్యర్థులకు రూ.50వేలు
  • ఫిబ్రవరి 15 నుంచి క్యాండిడేట్ల ఎంపిక ప్రక్రియ
  • తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి


దిశ నల్లగొండ, హైదరాబాద్ బ్యూరో:

రాష్ట్రంలో బీఆర్ఎస్ పూర్తిగా సచ్చిపోయిందని, ప్రజలు బొందపెట్టేశారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM REVANTH REDDY) అన్నారు. మంగళవారం గాంధీభవన్‌లో కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రజాసమస్యలపై మాట్లాడేందుకు ఎవ్వరూ అపాయింట్‌మెంట్ అడిగినా ఇస్తామని, కేటీఆర్, హారీశ్‌రావుకు సమయం ఇస్తామన్నారు. కేసీఆర్ రూ.7 లక్షల కోట్లు అప్పుజేస్తే.. ప్రధాని మోదీ రూ.100 కోట్ల అప్పులు చేశారని తెలిపారు. మూడోసారి విద్వేషం రెచ్చగొట్టి అధికారంలోకి రావాలని చూస్తున్నారని, మోదీని కట్టడి చేయాలంటే కాంగ్రెస్‌తోనే సాధ్యమని చెప్పారు. కేసీఆర్ మౌనంగా ఇంట్లో పండుకోలేదని, రహస్యంగా మోదీతో ఒప్పందం కుదుర్చుకున్నారని పేర్కొన్నారు.

CM REVANTH REDDY:

ఎమ్మెల్సీలు ప్రమాణస్వీకారం చేస్తామంటే.. కుట్రతో వాయిదా వేశారన్నారు. పునర్విభజన చట్టంలో బయ్యారం ఉక్కు, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్ వంటి ప్రాజెక్టుల గురించి మోదీ ఏనాడూ పట్టించుకోలేదన్నారు.CM REVANTH REDDY నల్లధనం తీసుకొచ్చి ప ప్రతి పేదవాడి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామని చెప్పారని, నేటికీ చిల్లి గవ్వ వేయలేదన్నారు. రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తామన్నారని, కానీ రైతులకు పెట్టుబడి రాక.. గిట్టుబాటు ధర దక్కక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పండిన వరిని సైతం కేంద్రం కొనలేని స్థితిలో ఉందని తెలిపారు.

అంతకుముందు పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్ రెడ్డి(CM REVANTH REDDY) అధ్యక్షతన ఏఐసీసీ ఇంచార్జ్ దీపా దాస్ మున్శి ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశమై లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక, కార్యాచరణపై చర్చించారు. అభ్యర్థుల ఎంపికను ఏఐసీసీకి అప్పగించామని, వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయాలని భావించే వాళ్లు ఫిబ్రవరి 3వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు దరఖాస్తు చేసుకోవాలని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీలకు రూ.25వేలు, జనరల్, బీసీ అభ్యర్థులకు రూ.50వేలు చెల్లించాలని, ఫిబ్రవరి 15 నుంచి 20 వరకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఉంటుందని వివరించారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి మంత్రిని, సీనియర్ నేతను ఇంఛార్జిగా పెట్టామని తెలిపారు.

OnePlus:OnePlus 12, OnePlus 12R, Nord Buds 3 launched in India: Check price, sale offers, specs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *