- లవ్, డేటింగ్, రిలేషన్షిప్ పై ప్రత్యేక పాఠ్యాంశాలు
- సోషల్ మీడియాలో వైరల్ గా మారిన చిత్రాలు
- దిశ నల్లగొండ, హైదరాబాద్ బ్యూరో:
CBSE : సీబీఎస్ఈ 9వ తరగతి పాఠ్య పుస్తకంలో డేటింగ్, లవ్, రిలేషన్‌షిప్‌కు సంబంధించిన పాఠ్యాంశాలు ఉండడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడయాలో వైరల్ అయ్యాయి. నిజానికి ప్రస్తుత సమాజంలో డేటింగ్, లవ్, లస్ట్, పోర్న్ వంటి పదాలకు కొత్తగా అర్థాలు చెప్పాల్సిన అవసరం లేదని, ఇప్పటి జనరేషన్ చాలా ఫాస్ట్‌గా ఉంది. మీరు చిన్నపిల్లలు అనుకునే మీ పిల్లలు ఇక చిన్నోళ్లు కాదని, వారికి తెలియాల్సిన టైమ్ వచ్చిందనే అభిప్రాయం లేకపోలేదు. ఇలాంటి పరిస్థితుల్లోనే సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ)(CBSE) సరికొత్త విధానాన్ని అవలంభిస్తోంది.
CBSE :
ప్రస్తుత సమాజ పోకడలకు అనుగుణంగా పాఠ్యాంశాల రూపకల్పనకు సీబీఎస్ఈ శ్రీకారం చుట్టింది. ప్రధానంగా టీనేజీ విద్యార్థులకు లవ్, డేటింగ్, రిలేషన్‌షిప్ తదితర అంశాలపై అవగాహన కల్పించడం కోసం ప్రత్యేక పాఠ్యాంశాన్ని రూపొందించింది. సీబీఎస్ఈ(CBSE) 9వ తరగతి విద్యార్థులకు సంబంధించిన వ్యాల్యూ ఎడ్యుకేషన్ పుస్తకాల్లో ఈ పాఠ్యాంశాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అయిటే డేటింగ్ పాఠ్యాంశానికి సంబంధించిన ఫోటోలను ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పంచుకోవడంతో వైరల్‌గా మారింది. ఈ పాఠాలను చూసి నెటిజన్లు షాకయ్యారు. మరోవైపు ఆన్‌లైన్ డేటింగ్ వెబ్‌సైట్ టిండర్ ఇండియా ట్విట్టర్‌లో స్పందించింది. ఇక తర్వాత పాఠం బ్రేకప్‌ల గురించి ఉంటుందేమో అని పేర్కొంది.
Group 1 : గ్రూప్ 1 నోటిఫికేషన్ ఎప్పుడు..?.. కాంగ్రెస్‌పై కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు