నేటి యువత విఘ్నేశ్వరస్వామి(Vinayaka Chavithi) పూజా ద్వారా అనేక విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. యువత ప్రతి ఇంటి ముందు గ్రామాల్లో కూడలి భాగస్వాములై వినాయక విగ్రహాలకు మండపాల ద్వారా పూజ నిర్వహించడానికి ఎంతో ఉత్సాహం చూపుతున్నారు. కానీ ఆ పండుగ(Vinayaka Chavithi)లో ఉన్న ఆంతర్యాన్ని మాత్రం గ్రహించడంలో మాత్రం వెనుకంజ వేశారని చెప్పకనే చెప్పొచ్చు. దానికోసం మన పూర్వీకులు మనకు ఎన్నో గ్రంథాల ద్వారా పూజా విధానంలో ఆంతర్యాన్ని, దాని ద్వారా కలిగే ఉపయోగాలను తెలియపరిచినప్పటికీ కాలక్రమేణా అవి మరుగున పడ్డాయి. నేటి యువత పూజ కంటే అక్కడ నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం వినాయక చవితి(Vinayaka Chavithi) జరుపుకునే ఉద్దేశాన్ని మర్చిపోయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇప్పటికైనా వాటిని గుర్తించే విధంగా నేటి తరానికి అందించవలసిన బాధ్యత అందరిపైన ఉన్నది.
చెట్టు ఆకులతో పూజిస్తుంటారు ఎందుకు?
వినాయక చవితి(Vinayaka Chavithi)లో ప్రాధాన్యత సంతరించుకున్న పూజా ద్రవ్యాలను, 21 చెట్టు ఆకులను పూజిస్తుంటారు. వాటిని గురించి ముందుగా తెలుసుకుందాం!. మానవ జీవనానికి అవసరమైంది ప్రాణవాయువు. ఆ ప్రాణవాయువు చెట్ల నుంచే లభిస్తుంది. అది అందరికీ తెలిసిన విషయమే. కానీ దానితోపాటు మానవుడికి సంక్రమించే అనేక వ్యాధులకు దివ్య ఔషధంగా చెట్టు ఆకులు ఉపయోగపడతాయి. వాటి నుంచి తయారుచేసిన ఔషధాల(medicine)ను తీసుకోవడం వల్ల అనేక దీర్ఘకాలిక వ్యాధులు తొలగించుకోవచ్చని మన ప్రాచీన ఆయుర్వేద శాస్త్రం(scince) చెప్పకనే చెబుతుంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని 21 పత్రాలతో (ఆకులు) వినాయకుని పూజించడం వల్ల అట్టి చెట్టును ఆకు(leaves)ను గుర్తించి వ్యాధుల చికిత్సలో ఉపయోగించుకునే ఉద్దేశంతో పత్రాలతో పూజ చేయమని పెద్దలు చెప్పారు.
జంతు సంరక్షణ సామాజిక బాధ్యత..
విఘ్నేశ్వరుడి అలంకారం కోసం అనేక ఆభరణాలుగా అనేక జీవరాసులు ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో ముఖ్య ఉద్దేశం విఘ్నేశ్వరుడి(Vinayaka Chavithi)కి వాహనంగా ఎలుక, ఆయన ధరించే యజ్ఞోపవేతము పామును, ఆయన ధరించింది ఏనుగు తల ఉండగా, అతని సోదరుడు కుమారస్వామికి నెమలి వాహనంగా, శివుడి(lord shiva)కి నంది వాహనంగా ఉండటం గమనార్హం. దీన్నిబట్టి తెలుసుకోవాల్సింది ఏమిటో తెలుసా?.. ఈ జంతువులన్నీ కూడా ఒకదానికొకటి వైరముతో జీవించే జంతువులు(animals). అయినప్పటికీ ఒకేచోట ఎవరి పని వారు చేసుకుంటూ పక్క వారికి ఇబ్బందిని కలిగించకుండా జీవించటం ముఖ్య ఉద్దేశంగా చెప్పవచ్చు. దాంతోపాటుగా మానవుడు జంతువుల(animals)తో సహజీవనం చేయటం ప్రకృతిలోని సమతుల్యాన్ని కాపాడేందుకు ఎంతో అవసరమని దీనిలోని ఆంతర్యం. ఇట్టి విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పక్షుల ద్వారా మనకు హాని కలిగించే సూక్ష్మజీవులను క్రిమి కీటకాలను ఆహారంగా తీసుకోవడం ద్వారా మనకు రక్షణతో పాటు ప్రకృతిని పరిరక్షించటం.. జంతువుల(animals)తో సహజీవనం.. మానవాళికి ప్రత్యక్షంగా పరోక్షంగా నేలపై జీవించే పశుపక్షాదులు మనకు ఎంతో అవసరం. దీన్ని గుర్తించి మన పెద్దలు వాటి సంరక్షణ బాధ్యతను గుర్తుచేసేందుకు ఈ విధంగా ఏర్పాటు చేశారన్న అంశాన్ని మనం గుర్తించాలి.
విగ్రహాన్ని చెరువులోని కొత్త మట్టిని సేకరించి.. ఆ మట్టితో వినాయక విగ్రహాన్ని తయారు చేయడంతో పిల్లల్లో సృజనాత్మక శక్తి పెంపొందుతుంది. దానితోపాటు నీటి నిలువ ఉంచే విధానంతో పాటు నీటి పరిశుభ్రత గురించి తెలుసుకునే అవకాశం ఏర్పడుతుంది. వినాయక(Vinayaka Chavithi) విగ్రహం నిమజ్జనం ఎందుకు చేయాలనే సందేహం రావచ్చు. చెరువులు, బావులు, నదులు.. వీటిలో వర్షాల వల్ల నీరు కలుషితం కావడం సర్వసాధారణం. వీటిని శుభ్రం చేయడానికి 21 పత్రాలతో చేసిన పత్రియే సమాధానం. అందుకే 9 రోజుల పూజ తర్వాత ఆ పత్రితో బాటు మట్టి విగ్రహాన్ని కూడా నదుల్లో, చెరువుల్లో, బావుల్లో నిమజ్జనం చేయడం.. అలా నీటిలో కలిపిన మట్టి 21 రకాల పత్రితో కలిసి 23 గంటలయ్యాక తమలో ఉన్న ఔషధీయుత గుణాల ఆల్కలాయిడ్స్‌ని ఆ జలంలోకి వదిలేస్తాయి. దీనివల్ల జీవరాసులకు పశుపక్షాదులకు, మానవ జీవనానికి ఆధారభూతమైన నీటిని శుభ్రపరిచే విధంగాఉపయోగపడుతుంది.