HOMEసూర్యాపేటకు సీఎం కేసీఆర్.. ఏర్పాట్లు చూస్తే షాకవ్వాల్సిందే.. Disha Nalgonda1 year ago1 year ago01 mins సూర్యాపేట జిల్లా ప్రజలందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం ఆసన్నమైనది. ఆదివారం సూర్యాపేటకు సీఎం కేసీఆర్ రానున్నారు. దీనికోసం తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఎమ్మెల్యేలు అందరూ సూర్యాపేటలోనే మకాం వేసి దగ్గరుండి ఏర్పాట్లు చూసుకున్నారు. కార్యాలయాల వద్ద ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ వెంకట్రావ్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిచారు. పట్టణ పరిధి కుడకుడలో 21 ఎకరాల్లో 1,25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో పరిపాలన భవనంతోపాటు అధికారుల కోసం నివాస సముదాయం నిర్మించారు. రెండతస్తుల భవనంలో కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ చాంబర్లతోపాటు మొత్తం ఒకే చోట 37 శాఖలు ఉండేలా గదులు కేటాయించారు. సూర్యాపేట పట్టణంలోని 48 వార్డుల నుంచి -40 వేలు, మండలానికి 15000వేల చొప్పున నాలుగు మండలాల నుంచి 90 వేల మంది రానున్నాట్టు అంచనా. అదేవి ధంగా తుంగతుర్తి నియోజకవర్గం నుంచి 50 వేలు, కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల నుంచి 30వేల చొప్పున మొత్తం రెండు లక్షల పైగా సభకు హాజరుకానున్నారు. 6 లక్షల చదరపు అడుగుల సామర్థ్యంతో మెడికల్ కళాశాల భవనంతోపాటు బాలుర, బాలికలకు వేరు వేరు క్వాటర్స్ ఏర్పాటుచేశారు. కళాశాలలో విద్యార్థుల సంఖ్య 700 మంది కాగా, 900 మంది వరకు ఉండేందుకు వీలుండేలా హాస్టళ్లు సిద్ధమయ్యాయి. పట్టణంలోని ఎస్వీ ఇంజనీరింగ్ కాలేజ్ సమీపంలో 20 ఎకరాల స్థలాన్ని పోలీసు కార్యాలయ భవనానికి మంజూరు చేసింది. పోలీస్ ఆఫీసు బిల్డింగ్ తో పాటు జిల్లా పోలీసు ఉన్నతాధికారుల నివాస గృహాలు ఒకే ప్రాంగణంలో కొలువుదీరాయి. ల్యాండ్ స్కేప్, పార్కింగ్, అంతర్గత రహదారులతో కూడిన ప్రధాన భవన నిర్మాణం అందులోని గదులు తుది మెరుగుల దశలో ఉన్నాయి. 2014 ఎన్నికల సమయంలో సూర్యాపేట జిల్లాను ఏర్పాటు చేస్తానని హామీ ఇవ్వగా ఆ మేరకు 2016లో కొత్త ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. 2017 అక్టోబర్ కలెక్టరేట్ భవనానికి భూమి పూజ చేశారు. మంత్రి జగదీశ్ రెడ్డి ప్రత్యేక చొరవతో పచ్చదనం, ఉద్యోగుల సౌకర్యాలు కల్పించారు. శాఖల గదుల కేటాయింపు చేశారు. Post Views: 65 Post navigation Previous: Komatireddy:కోమటిరెడ్డిపై కుంభం సంచలన వ్యాఖ్యలు.. సీఎం కేసీఆర్ ఆ పదవి ఆఫర్ చేశారంటూ ఓపెన్Next: బిగ్ బ్రేకింగ్.. ఆ జిల్లాల్లో ఎన్ఐఏ(NIA) సోదాలు.. టార్గెట్ అదే..? Leave a Reply Cancel replyYour email address will not be published. Required fields are marked *Comment * Name * Email * Website Save my name, email, and website in this browser for the next time I comment.