- చండూరు గాంధీజీ పాఠశాలలో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు
- పాల్గొన్న జబర్దస్త్ ఫేమ్ ఆర్టిస్టులు
దిశ నల్లగొండ, చండూరు:
సమాజానికి ఎవ్వరూ మంచి చేసినా వారి వెంట నేనుంటానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి(KomatiReddy) రాజగోపాల్ రెడ్డి అన్నారు. చండూరు మున్సిపాలిటీలోని గాంధీజీ విద్యాసంస్థలో బుధవారం జరిగిన 44వ వార్షికోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా మునుగోడు శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి హాజరయ్యారు. చండూరుకు చేరుకున్న ఎమ్మెల్యేకు గాంధీజీ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాస్ పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. జ్యోతి ప్రజల్వన చేసి వార్షికోత్సవ వేడుకలను ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి(KomatiReddy) మాట్లాడుతూ.. విద్యా వైద్యం అనేది సమాజానికి ఎంతో అవసరమన్నారు. సమాజ సేవ ద్వారా విద్యను, వైద్యాన్ని అందించాలన్నారు.
KomatiReddy:
తన చిన్నతనంలో ఊరిలో క్లాస్ రూమ్‌లు లేక చెట్ల కిందనే చదువుకున్నామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు లేని సందర్భంలో మాకు చేతనైన సహాయంతో మౌలిక సదుపాయాలు అందిస్తున్నామన్నారు. విద్య విషయంలో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ సహకారం తప్పకుండా ఉంటుందన్నారు. ప్రైవేట్ విద్యాసంస్థలు పేద విద్యార్థులకు సర్వీస్ చేయాలని వారికి తమ సపోర్ట్ ఉంటుందన్నారు. రాజకీయాల కంటే ఎక్కువ మానవ సంబంధాలకే విలువ ఇవ్వాలని తెలిపారు. పదవి(KomatiReddy) ఉన్నా పదవి లేకపోయినా అనుకున్నది సాధించానన్నారు. తన రాజీనామాతో రూ.570 కోట్ల నిధులు ప్రభుత్వం ఇచ్చిందన్నారు. తన రాజీనామాతో లాభం జరిగిందన్న తృప్తి ఉందన్నారు. వార్షికోత్సవం సందర్భంగా చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.
జబర్దస్త్ ఫేమ్ గడ్డం నవీన్, వినో,ద్ శాంతి, శాంతి కుమార్ స్కిట్స్ ఆకట్టుకున్నాయి. ఎమ్మెల్యేతో పాటు గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్ ప్రతిష్ట చైర్మన్ గున్న రాజేందర్ రెడ్డి, నల్గొండ డీఈఓ భిక్షపతి, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ రాష్ట్ర కార్యదర్శి యానాలా ప్రభాకర్ రెడ్డి, ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు కాందాల పాపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Crime News: మంత్రాల నెపంతో 2018లో హత్య.. తాజాగా 14 మందికి జీవిత ఖైదు