- విద్యాలయాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తా..
- ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి
దిశ నల్లగొండ, వలిగొండ
విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దేందుకు ఆదర్శ పాఠశాలలు ఎంతగానో ఉపయోగపడతాయని భువనగిరి ఎమ్మెల్యే కుంభం(kumbham) అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం వలిగొండ మండలంలోని లోతుకుంట గ్రామం పరిధిలో గల ఆదర్శ పాఠశాల పదవ వార్షికోత్సవం కార్యక్రమానికి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదర్శ పాఠశాలల విద్యార్థులు ఎంతో ప్రతిభ కలిగి ఉన్నారని విద్యార్థులు ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడడం తనకు ఎంతో సంతృప్తిని అందించిందని, నేటి ఆధునిక పోటీ సమాజంలో ఇంగ్లీష్ తప్పనిసరి అని విద్యార్థులంతా ఇంగ్లీష్ భాష పై పట్టు సాధించాలని ఆయన అన్నారు.
Kumbham
ఆదర్శ పాఠశాలకు వెళ్లే దారి కోసం సిసి రోడ్డు మంజూరు చేయిస్తానని పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని అన్నారు. అనంతరం ఆదర్శ పాఠశాల ప్రక్కనే ఉన్న కస్తూరిబా బాలికల విద్యాలయానికి చేరుకొని అక్కడి సమస్యలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాలలోని విద్యార్థులకు కావలసిన తరగతి గది బెంచీలను అందిస్తానని ఆయన అన్నారు. అదేవిధంగా ఆదర్శ పాఠశాల కస్తూరిబా పాఠశాల క్రీడా మైదానాలలో మట్టిని నింపేందుకు తన సహాయ సహకార అందిస్తానని అన్నారు. అనంతరం ఆదర్శ పాఠశాల తరఫున ఎమ్మెల్యే కుంభ(kumbham) అనిల్ కుమార్ రెడ్డికి ఘన సన్మానం నిర్వహించారు. అంతకుముందు విద్యార్థులు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆహ్వానితులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినీలు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.