కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ(sonia Gandhi) చాలాకాలం తర్వాత హైదరాబాద్(hyderabad)లో అడుగుపెట్టారు. దీంతో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త జోష్ నింపినట్టయ్యింది. తెలంగాణ రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్(Congress) ముందుకు వెళుతుంది. పక్క రాష్ట్రమైన కర్ణాటకలో విజయకేతనం ఎగరవేసిన ఊపులో తెలంగాణను క్లీన్ స్వీప్ చేయాలని చూస్తోంది. కర్ణాటకలో అవలంభించిన ఎన్నికల వ్యుహాలనే తెలంగాణలోనూ అమలు చేసేందుకు పక్కా స్కెచ్‌తో ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో కాంగ్రెస్(Congress) పార్టీ నిర్వహించిన భారీ బహిరంగ సభలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ(sonia Gandhi) ఎన్నికల 6 గ్యారంటీ స్కీమ్‌లను ప్రకటించారు. ఈ సందర్భంగా సోనియా గాంధీ(sonia Gandhi) మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. తెలంగాణను దేశంలోనే నంబర్ వన్‌గా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ప్రజాభివృద్ది కోసమే తెలంగాణను ఏర్పాటు చేశామని, కాంగ్రెస్(Congress)కు తెలంగాణ ప్రజలు అండగా నిలబడాలని కోరారు.
ఆరు గ్యారంటీ స్కీమ్‌లు ఇవే..
- మహాలక్ష్మి స్కీమ్ – మహిళలకు ప్రతి నెలా రూ. 2,000 సాయం. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత(free) ప్రయాణం. రూ. 500కే వంట గ్యాస్ సిలిండర్.
- రైతుభరోసా – రైతులు, కౌలురైతులకు ఏటా రూ. 15,000 పంట పెట్టుబడి సాయం. వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి రూ. 12,000 సాయం. వరి పంటకు ప్రతి క్వింటాల్‌కు రూ. 500 బోనస్.
- గృహజ్యోతి – ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత(free) కరెంటు.
- ఇందిరమ్మ ఇండ్లు – ఇల్లు లేనివారికి ఇంటి స్థలంలో నిర్మాణానికి రూ. 5 లక్షల సాయం. ఉద్యమకారుల కుటుంబాలకు 250 చ.గజాల స్థలం కేటాయింపు.
- యువ వికాసం – విద్యార్థులకు రూ. 5 లక్షల విద్యా భరోసా కార్డు. ప్రతీ మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్.
- చేయూత – నెలకు రూ. 4,000 చొప్పున పింఛను. రూ. 10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా