- వరకట్న చట్టాల దుర్వినియోగంపై ఆందోళన
- సెక్షన్ 498ఏ మిస్ యూజ్‌ను అరికట్టేందుకు
- లాయర్లతో పాటు పలు సంఘాల పిలుపు
sucide : భార్య, అత్తమామల వేధింపుల కారణంగా ఓ యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అతుల్ సుభాష్ ఆత్మహత్య చేసుకోవడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. తప్పుడు వరకట్న వేధింపుల కేసులో తనను ఇరికించారని, భార్య, ఆమె కుటుంబం వేధిస్తుందని చెబుతూ అతుల్ ఆత్మహత్య చేసుకున్న తీరు అందరినీ కంటతడి పెట్టిస్తోంది. బీహార్‌కి చెందిన అతుల్.. బెంగళూర్‌లోని తన ఇంటిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. న్యాయవ్యవస్థ కూడా తన భార్య నికితా సింఘానియకు మద్దతుగా నిలిచిందని, ఏ తప్పు చేయకున్నా తనను వేధిస్తున్నారంటూ ఆయన 24 పేజీల సూసైడ్ నోట్‌తో సహా 80 నిమిషాల వీడియో చేసి తన బాధను వ్యక్త పరిచాడు.
sucide : ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ వీడియో కాస్త దేశ వ్యాప్తంగా వైరల్‌గా మారింది. దీంతో అతుల్ సుభాష్‌కు న్యాయం జరగాలని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తు్న్నారు. అయితే ఈ కేసు సుప్రీంకోర్టు దృష్టికి వచ్చింది. ఒక వ్యక్తి, అతడి తల్లిదండ్రులపై వరకట్న వేధింపుల కేసును కొట్టివేయడానికి నిరాకరించిన తెలంగాణ హైకోర్టు ఆదేశాలను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎఫ్ఐఆర్ పరిశీలిస్తే భార్య ఆరోపణలు అస్పష్టంగా ఉన్నాయని కోర్టు గుర్తించింది. కొంత మంది నిందితులకు ఈ విషయంలో సంబంధం లేదని, ఎలాంటి కారణం లేకుండా ఈ కేసులోకి లాగబడ్డారని పేర్కొంది. వైవాహిక వివాదాల్లో భర్త కుటుంబంలోని సభ్యులందర్ని ఇరికించే ధోరణి తరుచుగా ఉంటుందని, నిర్ధిష్ట సాక్ష్యాధారాలు లేకుండా ఇలాంటి ఆరోపణలు విచారణకు ఆధారం కావని జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్‌లతో కూడిన ధర్మసనం వ్యాఖ్యానించింది.
politics : మస్తు కాస్ట్‌లీగా ఎన్నికలు.. మండలి చైర్మన్ గుత్తా సంచలన వ్యాఖ్యలు
sucide : ఇదిలావుంటే.. ఈ కేసు నేపథ్యంలో వరకట్న వేధింపులకు సంబంధించి సెక్షన్ 498ఏ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు తక్షణ సంస్కరణలు తీసుకురావాలని పలువురు లాయర్లతో పాటు పలు సంఘాలు పిలుపునిచ్చాయి. లాయర్ అడ్వకేట్ వికాస్ పహ్వా బుధవారం ఈ సెక్షన్ దుర్వినియోగాన్ని అడ్డుకోవాలని కోరారు. మూడు దశాబ్ధాలుగా క్రిమినల్ లాయర్‌గా గుర్తింపు పొందిన పహ్వా మాట్లాడుతూ.. కొందరు వ్యక్తిగతంగా సెక్షన్ 498ఏ దుర్వినియోగం చేయడాన్ని తాను చూశానని చెప్పారు.