NEP : కొత్త జాతీయ విద్యావిధానం అణగారిన వర్గాలకు శాపమే.. ఓయూ పీహెచ్డీ స్కాలర్ పాలడుగు
NEP : జాతీయ నూతన విద్యావిధానం అణగారిన వర్గాలకు శాపంగా మారనుందని ఉస్మానియా యూనివర్సిటీ పీహెచ్డీ స్కాలర్ పాలడుగు శ్రీనివాస్ తెలిపారు. బుధవారం ఢిల్లీలో కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను పీహెచ్డీ స్కాలర్ పాలడుగు శ్రీనివాస్ బృందం కలిసి జాతీయ నూతన విద్యావిధానం వల్ల కలిగే నష్టాలు, యూనివర్సిటీల్లో రిక్రూట్మెంట్ తదితర సమస్యలను విన్నవించారు.