telangana jobs : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జాబ్ క్యాలెండర్ రిలీజ్..

telangana jobs : నిరుద్యోగులకు గుడ్ న్యూస్ జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన తెలంగాణ సర్కార్...
  • ఏయే ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేయాలనే దానిపై స్పష్టత
  • గ్రూప్ 1 అక్టోబరులో.. గ్రూప్ 2 డిసెంబరులో..
  • వచ్చే ఏడాదిలో మేలో మరోసారి గ్రూప్ 2 నోటిఫికేషన్

telangana jobs : తెలంగాణలో ఉద్యోగ క్యాలెండర్‌ను ప్రభుత్వం ప్రకటించింది. అసెంబ్లీలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క జాబ్ క్యాలెండర్ ప్రకటించారు. ఏయే ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేయాలనే విషయాలను క్యాలెండర్‌లో స్పష్టంగా పేర్కొన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదల చేసే నెల, పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలనే వివరాలతో పాటు నియామకాలు నిర్వహించే ఏజెన్సీ, ఉద్యోగానికి కావాల్సిన అర్హతల గురించి జాబ్ క్యాలెండర్‌లో పొందుపర్చారు. ప్రభుత్వం ప్రకటించిన జాబ్‌ క్యాలెండర్‌ ప్రకారం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా గ్రూప్ పోస్టులను భర్తీచేయనున్నారు. ఇందులో అక్టోబరులో గ్రూప్‌-1 పరీక్షలు, డిసెంబరులో గ్రూప్‌-2 పరీక్ష, నవంబరులో గ్రూప్‌-3 పరీక్ష నిర్వహించనున్నారు.

వివిధ పరీక్షల తేదీలు ఇలా..

  • వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో ల్యాబ్ టెక్నీషియన్, నర్సింగ్ ఆఫీసర్ నియామకాల కోసం సెప్టెంబర్‌లో నోటిఫికేషన్ విడుదల చేసి, నవంబర్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు
  • ట్రాన్స్‌కోలోని ఉద్యోగాల భర్తీకి అక్టోబర్‌లో నోటిఫికేషన్ విడుదల చేసి, వచ్చే ఏడాది జనవరిలో నియామక పరీక్షలు నిర్వహించనున్నారు.
  • నవంబర్‌లో టెట్ నోటిఫికేషన్ విడుదల చేసి వచ్చే ఏడాది జనవరిలో పరీక్షలు నిర్వహించనున్నారు.
  • రాష్ట్రప్రభుత్వ విభాగాల్లో వివిద గెజిటెడ్ పోస్టుల భర్తీకి ఏడాది జనవరిలో నోటిఫికేషన్ విడుదల చేసి, ఏప్రిల్‌లో నియామక పరీక్షలు నిర్వహించనున్నారు.
  • డీఎస్సీ నోటిఫికేషన్‌ను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేయనున్నారు. ఏప్రిల్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు.
  • అటవీశాఖలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వెలువడనుంది. మే నెలలో పరీక్షలు నిర్వహించనున్నారు.
  • వచ్చే ఏడాది జులైలో ‘గ్రూప్‌-1’ మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు.
  • పోలీసు శాఖలో ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం 2025, ఏప్రిల్‌లో నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. నియామక పరీక్షలను ఆగస్టులో నిర్వహించనున్నారు.
  • డిగ్రీ లెక్చరర్లు, ఫిజికల్ డైరెక్టర్లు, లైబ్రేరియన్ పోస్టులకు 2025, జూన్‌లో నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. సెప్టెంబర్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు.
    -గ్రూప్-2 నోటిఫికేషన్‌ను వచ్చే ఏడాది మేలో మరోసారి విడుదల చేయనున్నారు. అక్టోబర్‌లో పరీక్షలు నిర్వహిస్తారు.
  • గ్రూప్‌-3 నోటిఫికేషన్‌ను వచ్చే ఏడాది జులైలో విడుదల కానుంది. telangana jobs నవంబర్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు.
  • సింగరేణిలో ఉద్యోగాల భర్తీకి 2025, జులైలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. నవంబర్‌లో నియామక పరీక్షలు నిర్వహించనున్నారు.

telangana jobs : కేయూలో విద్యార్థి, నిరుద్యోగుల సంబరాలు..

telangana jobs : నిరుద్యోగులకు గుడ్ న్యూస్ జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన తెలంగాణ సర్కార్...
telangana jobs : నిరుద్యోగులకు గుడ్ న్యూస్ జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన తెలంగాణ సర్కార్…

తెలంగాణ సర్కారు జాబ్ క్యాలెండర్ విడుదలపై కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు, నిరుద్యోగుల సంబరాలు సంబరాలు నిర్వహించారు. శాసనసభలో జాబ్ క్యాలెండర్ ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేస్తూ తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ మేడారపు సుధాకర్ ఆధ్వర్యంలో కేయూ మొదటి గేటు వద్ద సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పుష్పాభిషేకం, పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ మేడారపు సుధాకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి నరేష్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం శాసనసభలో జాబ్ క్యాలెండర్‌ను ప్రకటించిందని, telangana jobs తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలైనా గత ప్రభుత్వం ఏనాడూ నిరుద్యోగులకు పక్షాన నిలువలేదని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం.. 30 వేల ఉద్యోగ నియామకాలు, సకాలంలో డీఎస్సీ నిర్వహణ, గ్రూప్ 2 వాయిదా, జాబ్ క్యాలెండర్ వంటి నిర్ణయాలు తీసుకుంటూ విద్యార్ధి నిరుద్యోగుల పక్షపాతిగా ఉన్నారని, వారికి విద్యార్థి లోకం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందన్నారు.

old city metro : పాత ప్రభుత్వంతో దోస్తీ చేసినం.. ఇప్పటి సర్కారుతోనూ దోస్తీ జేస్తం

telangana jobs : గత ప్రభుత్వాల హయంలో…

గత ప్రభుత్వాల హయంలో విద్యార్థి, నిరుద్యోగులు ఏ ఉద్యోగ నియామకాలు ఎప్పుడు వెలువడతాయో అర్థం కాని అయోమయంలో ఉండేవారని, ప్రస్తుతం జాబ్ క్యాలెండర్ ద్వారా వారు ప్రిపేర్ అయ్యే పరీక్ష తేదీ ప్రకటన ద్వారా ప్రక్క ప్రణాళికతో చదివి, విజయం సాధిస్తారన్నారు. telangana jobs ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి నరేష్, అభిరామ్ రమేష్, రమేష్ చంద్ర, సురేష్, రాజశేఖర్, అశోక్, పుష్పలీల, మొగిలి, రమ, నాగరాజు, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *