Go 46 : ప్రభుత్వాన్ని వదలబోం.. జీఓ 46 రద్దు చేసే వరకు రణరంగమే…

Go 46 : ప్రభుత్వాన్ని వదలబోం.. జీఓ 46 రద్దు చేసే వరకు రణరంగమే...
  • నిరుద్యోగ యువతను కేసుల పాలు చేస్తున్న కాంగ్రెస్
  • 46 బాధితులకు పిడిగుద్దులే మిగిలినయ్
  • జాబ్ క్యాలెండర్ ఓ తెల్లకాగితం
  • బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి

Go 46 : జీఓ 46ను రద్దు చేసేంత వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదలబోమని, అప్పటి వరకు రణరంగం కొనసాగుతూనే ఉంటుందని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి తెలిపారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజా భవన్ గురించి కాంగ్రెస్ ప్రభుత్వం కహానీలు చెప్పిందని, ప్రజాభవన్‌కు వెళ్లిన జీవో 46 బాధితులకు పిడిగుద్దులే మిగిలాయన్నారు. ఇష్టమొచ్చినట్టు జీవో 46 బాధితులను పోలీసులు దుర్మార్గంగా హింసించారని ఆరోపించారు. బాధితులు ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించినా.. కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలు కనీసం స్పందించ లేదన్నారు. జీవో 46 బాధితులను పోలీస్ స్టేషన్‌లో కలుద్దామని వెళితే ఎన్నో ఆంక్షలు పెడుతున్నారన్నారు. నిరుద్యోగ యువతను కాంగ్రెస్ ప్రభుత్వం కేసుల పాలు చేస్తోందని ఫైర్ అయ్యారు. జీవో 46 బాధితుల పక్షాన పోరాడుతామని కేటీఆర్ ఇదివరకే హామీ ఇచ్చారని గుర్తు చేశారు.

Go 46 : ప్రభుత్వాన్ని వదలబోం.. జీఓ 46 రద్దు చేసే వరకు రణరంగమే...
Go 46 : ప్రభుత్వాన్ని వదలబోం.. జీఓ 46 రద్దు చేసే వరకు రణరంగమే…

cm revanth : పెట్టుబడులే టార్గెట్… తెలంగాణ అభివృద్ధే ఫస్ట్ ప్రయారిటీ…

Go 46 : ఓ తెల్ల కాగితాన్ని జాబ్ క్యాలెండర్…

ఓ తెల్ల కాగితాన్ని జాబ్ క్యాలెండర్ పేరిట అసెంబ్లీలో పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను ముంచిందని విమర్శించారు. అయితే జాబ్ క్యాలెండర్‌లో జాబ్ లేదని, క్యాలెండర్ లేదని, ఇది జాబ్ క్యాలెండర్ కాదని, జారుకునే క్యాలెండర్ అని సెటైర్లు వేశారు. జాబ్ క్యాలెండర్‌పై తన మిత్రపక్షం డీఎంకేను చూసైనా ఇక్కడి కాంగ్రెస్ నేర్చుకోవాలని సూచించారు. 30 వేల ఉద్యోగాల భర్తీపై దమ్ముంటే మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాజీనామా సవాల్‌ను కాంగ్రెస్ నేతలు స్వీకరించాలని ఛాలెంజ్ చేశారు. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విడిచి పెట్టే ప్రసక్తే లేదని వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *