Fangal Cyclone : ఫెంగల్ ఎఫెక్ట్.. కిలో మునగ రూ.500

Fangal Cyclone : ఫెంగల్ ఎఫెక్ట్.. కిలో మునగ రూ.500
  • ఒక్కోటి రూ.50పైనే..
  • గత వారం క్రితమే రూ.150
  • బెంగళూరు మార్కెట్‌లో భారీగా ధరలు

Fangal Cyclone : ఫెంగల్ తుఫాన్ ఎఫెక్ట్ నుంచి ఇంకా జనం తేరుకోవడం లేదు. ఫెంగల్ తుఫాన్ కారణంగా బెంగళూరులో కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా కిలో మునగ ఏకంగా రూ.500కు చేరుకుంది. ఇక ప్రతి ఇంటిలో నిత్యం వినియోగించే ఉల్లి సైతం కిలో రూ.70 నుంచి 80కి పెరిగింది. కూరగాయల సాగుపై ఫెంగల్ తుఫాన్ ఎఫెక్ట్ పడడంతోనే ధరలు ఈస్థాయిలో పెరిగాయి. ప్రధానంగా తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటకలో అకాల వర్షం బీభత్సం సృష్టించి.. తీవ్ర పంట నష్టాన్ని కలిగించింది. బెంగళూరు రూరల్, రామనగర, చామరాజనగర, మైసూరు, కోలార్, చిక్కబళ్లాపుర, మాండ్య జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా అనేక కూరగాయల పంటలు ధ్వంసమయ్యాయి.

Fangal Cyclone : ఫెంగల్ ఎఫెక్ట్.. కిలో మునగ రూ.500

Fangal Cyclone : దీంతో బెంగళూరు మార్కెట్‌లో ధరలు పెరిగాయి. ఇప్పటికే బాగా డిమాండ్‌ ఉన్న మునగకాయల వంటి కూరగాయలను సామాన్యులు కొనలేకపోతున్నారని కళాసిపాళయ స్థానిక వ్యాపారి అన్వర్ బాషా అన్నారు. రిటైల్ మార్కెట్‌లో మునగకాయ ధరలు ఇప్పుడు కిలో రూ. 500కి చేరుకున్నాయని, ఒక్కో మునగ రూ.50గా ఉందని మరో వ్యాపారి చెప్పారు. గత వారం మునగకాయలు కిలో రూ.150కి అమ్ముడయ్యాయి. ఇప్పుడు అవే భారీగా పెరిగి రూ.500కు చేరుకున్నాయి.

Licence : మూడేండ్లలో 64వేల లైసెన్సులు రద్దు

ఫెంగల్ తుపాను(Fangal Cyclone)కు తోడు మరికొన్ని కారణాల వల్ల ధరలు పెరుగుతున్నాయని వ్యాపారులు అంటున్నారు. సాధారణంగా తమిళనాడులోనే కూరగాయలు బాగా పండుతాయని, ప్రస్తుత పరిస్థితుల కారణంగా ఇప్పుడు తాము కూడా మహారాష్ట్ర నుంచి కూడా దిగుమతి చేసుకుంటున్నామని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *